NTR: ఎన్టీఆర్ డెడికేషనే వేరే

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ఎలాంటి యాక్టర్ అనేది కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలో అయినా తారక్(Tarak) పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలో జీవించగలగడం అతని స్పెషాలటీ. ఎన్టీఆర్ కు ముందు నుంచి పౌరాణిక పాత్రలంటే ఎంతో ఇష్టం. యమదొంగ(Yamadonga), రామయ్యా వస్తావయ్యా(Ramayya Vasthavayya), జై లవకుశ(Jai Lava kusa) సినిమాల్లో పౌరాణికంకు సంబంధించి కొన్ని సీన్స్ లో కూడా నటించారు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ ను పౌరాణిక పాత్రల్లో చూసిన ఎంతోమంది ఆ జానర్ లో ఫుల్ లెంగ్త్ మూవీ చేస్తే బావుండని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కోసం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) అలాంటి ప్రాజెక్టునే రెడీ చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో కుమారస్వామి కథ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఇప్పట్నుంచే బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేశారు.
అందులో భాగంగా ఎన్టీఆర్ మురుగన్(Murugan) పుస్తకం చదువుతున్నారు. రీసెంట్ గా వార్2(War2) మూవీ కోసమని ముంబై వెళ్లిన తారక్, అక్కడి ఎయిర్‌పోర్టులో చేతిలో మురుగన్ కు సంబంధించిన బుక్ తో కనిపించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇంకా చాలా టైమ్ ఉండగానే ఎన్టీఆర్ ఈ సినిమాపై వర్క్ చేస్తుండటం చూసి ఎన్టీఆర్ ఎంత డెడికేటెడ్ యాక్టరో అని ప్రశంసిస్తున్నారు.