NTR: ఛావాకు ఎన్టీఆర్ డబ్బింగ్?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ఏ పని చేసినా చాలా పర్ఫెక్షన్ తో చేస్తాడు. ఈ తరం స్టార్ హీరోల్లో పర్ఫెక్షన్ ఉన్న యాక్టర్‌గా ఎన్టీఆర్ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా ప్రతీ దాంట్లో తనదైన శైలిలో తారక్ ఆడియన్స్ ను మెప్పించగలడు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ వాయిస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
తన సినిమాలకే కాకుండా వేరే హీరోల సినిమాలకు, వారి టీజర్లకు కూడా తారక్ వాయిస్ ఓవర్ ఇస్తుంటాడు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కింగ్డమ్(Kingdom) కు కూడా ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తారక్(Tarak) మరో సినిమాకు డబ్బింగ్ చెప్పనున్నాడనే వార్త టాలీవుడ్ చక్కర్లు కొడుతుంది.
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఛావా(Chhava) కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా హిందీ భాషలో మాత్రమే రిలీజైంది. ఛావాకు తెలుగు వెర్షన్ రిలీజ్ చేయమని ఆడియన్స్ తెగ డిమాండ్ చేస్తున్నారు. మేకర్స్ ఇంకా ఛావాను తెలుగులో డబ్ చేయాలా లేదా అని డెసిషన్ కూడా తీసుకోలేదు కానీ అప్పుడే ఛావాకు ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పనున్నాడని ప్రచారం మొదలుపెట్టారు. ఈ విషయంలో నిజమెంతున్నది తేలాలంటే మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సిందే.













