కొరటాలకు డెడ్లైన్ పెట్టిన ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో పాటూ వార్2 సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. వాస్తవానికి దేవర ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సింది కానీ షూటింగ్ లేటవడం వల్ల సినిమాను అక్టోబర్ కు వాయిదా వేశారు.
మళ్లీ ఇప్పుడు సెప్టెంబర్ 27కు ప్రీ పోన్ చేశారు. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర షూటింగ్ ను త్వరగా పూర్తి చేయాలని, ఆగస్ట్ లోపు సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని కొరటాల శివకు ఎన్టీఆర్ డెడ్ లైన్ పెట్టినట్లు తెలుస్తోంది. తన గత చిత్రం ఆచార్య డిజాస్టర్ అవడంతో ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ కొరటాల దీన్ని తెరకెక్కిస్తున్నాడు.
అందుకే షూటింగ్ కు ఎక్కువ టైమ్ పడుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమా షూటింగ్ స్క్రిప్ట్ విషయంలో ముఖ్యంగా ఆఖరి దశ షూటింగ్ కు సంబంధించి ఎన్టీఆర్ చాలా ఇన్పుట్స్ ఇస్తున్నట్లు యూనిట్ సభ్యులు చెప్తున్నారు. దేవర సినిమాను త్వరగా పూర్తి చేసి, వార్2 కోసం బల్క్ డేట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే తారక్, కొరటాలకు ఈ డెడ్ లైన్ పెట్టినట్లు సమాచారం.













