ఎన్టీఆర్30లో ఎన్టీఆర్ క్యారెక్టర్ అదేనా?
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, తన 30వ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న విషయం విదితమే. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నా, సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ రెండు సినిమాలకు ఓకే చెయగా కాకుండా శంకర్ సినిమాను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
త్వరలోనే బుచ్చిబాబు మూవీ అప్డేట్ ఇవ్వడానికి కూడా చరణ్ రెడీ అవుతుంటే ఎన్టీఆర్ మాత్రం అనౌన్స్ చేసిన 30వ సినిమానే ఇప్పటికీ పట్టాలెక్కించకపోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మే లో అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన చిత్ర బృందం ఇప్పటివరకు సినిమాపై ఎలాంటి అప్డేట్ని ఇవ్వలేదు. ఇదిలా ఉంటే త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్30 స్టోరీ, క్యారెక్టర్ ఇదేనంటూ ఓ కీలక అప్డేట్ రీసెంట్ గా బయటికొచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ జాలరిగా కనిపించనున్నాడట. టైటిల్ లుక్ టీజర్లో వీడియో మొత్తం సముద్రం, అలలు చూపించడంతో ఈ సినిమా సముద్రం చుట్టూ తిరుగుతుందని, సినిమాలో ఎన్టీఆర్ మేకోవర్ సరికొత్త గెటప్‌లు చాలా కొత్తగా ఉంటాయట. ఈ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ పేరు గట్టిగా వినిపిస్తోంది.
అయితే గత కొంతకాలంగా ఈ మూవీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు సంక్రాంతి రోజున సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఆ రోజున ఫస్ట్ లుక్ లేదా టైటిల్‌ని రిలీజ్ చేసే ఛాన్సుందని ఇన్సైడ్ టాక్. త్వరలో రెగ్యులర్ షూట్ ప్రారంభం కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.













