తొలిభాగం కథానాయకుడు… మలిభాగం మహానాయకుడు
ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారనే విషయం తెలిసిందే. అయితే ఈ రెండు భాగాల విడుదల నడుమ విరామం కేవలం రెండు వారాలు కావడం గమనార్హం. ఎన్టీఆర్ బయోపిక్కు రెండు భాగాలుగా విడుదల చేయనున్నారనే వార్తే పెద్ద సంచలనం సృష్టిస్తే, రెండే రెండు వారాల వ్యవధిలో ఈ రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయనది ప్రకంపనలు పుట్టిస్తోంది. జనవరి 9న తొలిభాగం, జనవరి 23న రెండో భాగం రానున్నాయి. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్‌గా నటిస్తు, నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ చిత్రాన్ని క్రిష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ప్రతి రెండు మూడు రోజులకొకసారి ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త సమచారం వెలువడుతూ రోజురోజూ అంచనాలు పెంచేస్తోంది.













