ఎన్టీఆర్ బయోపిక్ మొదటి టిక్కెట్ ధర 1,116డాలర్లు
మిచిగన్ రాష్ట్రం డిట్రాయిట్ నగరంలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా రిలీజ్ సందర్భంగా మొట్టమొదటి టికెట్‌ను డిట్రాయిట్‌కు చెందిన కొడాలి శ్రీనివాస్ 1116 డాలర్లకు కొనుగోలు చేసినట్లు డిట్రాయిట్ ప్రాంత పంపిణీదారులు ఎంటర్టెయిన్మెంట్స్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థానిక ఎన్నారై అభిమానుల నడుమ ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో పంత్ర సునీల్, దుగ్గిరాల కిరణ్, వంశీ కారుమంచి, యెర్నేని నవీన్, నాదెళ్ల గంగాధర్, పెద్దిబోయిన జోగేశ్వరరావు, బచ్చు సుధీర్, గోగినేని శ్రీనివాస, వెలగా శుభకర్ తదితరులు పాల్గొన్నారు.













