ఆయ్ ఈవెంట్ కు గెస్టులుగా ఆ ఇద్దరు స్టార్లు?
జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో వస్తున్న సినిమా ఆయ్. ఆగస్ట్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది.
ఇందులో భాగంగా ఆయ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ప్రస్తుతం నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఆయ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టులుగా అల్లు అర్జున్, ఎన్టీఆర్ ను పిలవాలని చిత్ర మేకర్స్ అనుకుంటున్నారట.
బన్నీ వాస్ కు అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ కావడంతో అతన్ని పిలవాలని చూస్తున్నారట. అలాగే ఈ సినిమా హీరో ఎన్టీఆర్ కు బామ్మర్ది కావడంతో అతన్ని కూడా పిలిచే ఛాన్సుంది. ఒకవేళ బన్నీ, ఎన్టీఆర్ ఈ సినిమా ఈవెంట్ కు వస్తే మాత్రం సినిమాకు ఒక్కసారిగా హైప్ పెరగడం ఖాయం. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమా జనాల మధ్యలోకి వెళ్లాలంటే స్ట్రాంగ్ ప్రమోషన్స్ వల్ల అది జరుగుతుంది. మరి ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి బన్నీ, తారక్ వస్తారా లేదా చూడాలి.













