రిషబ్ ఓకే అంటే నేను రెడీ- ఎన్టీఆర్
కాంతారా సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న రిషబ్ శెట్టి ఆ సినిమాతో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. దీంతో ఆయన్నుంచి రానున్న కాంతారా2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాంతారా2 కచ్ఛితంగా భారీ కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రిషబ్ శెట్టి కాంతారా2ను తెరకెక్కిస్తున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటకలోని ఉడిపి వెళ్లాడు. అక్కడ ఫ్యామిలీతో కలిసి శ్రీకృష్ణుడి గుడికి వెళ్లాడు. మంగుళూరు ఎయిర్పోర్ట్ లో రిషబ్శెట్టి ఎన్టీఆర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడంతో పాటూ ఉడిపి ఆలయానికి దగ్గరుండి మరీ తీసుకెళ్లాడు. గుడిలో దేవదర్శనం అనంతరం ఎన్టీఆర్ ని కన్నడ మీడియా ప్రతినిథులు పలకరించారు.
గుడిలో దర్శనానికి వచ్చానని చెప్పిన ఎన్టీఆర్ కు త్వరలో రిషబ్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న కాంతారా2లో భాగమయ్యే ఛాన్సుందా అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఎన్టీఆర్ కచ్ఛితంగా చేస్తాను. రిషబ్ శెట్టి ఎప్పుడు ఓకే అన్నా నేను రెడీగా ఉంటానని చెప్పుకొచ్చాడు. దీంతో కాంతారా2లో కాకపోయినా ఎన్టీఆర్, రిషబ్ శెట్టి కాంబోలో ఫ్యూచర్ లో సినిమా వచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. అదే జరిగితే ఫ్యాన్స్ కు పూనకాలు గ్యారెంటీ. వారి సినిమా తెలుగు, కన్నడ భాషల్లో దుమ్ము దులపడం ఖాయమని ఫ్యాన్స్ చెప్తున్నారు.













