ఎన్టీఆర్ సినిమాకు పవన్ టైటిలా?
దేవర అనే పదం వినగానే పవన్ కళ్యాణ్ గుర్తు రావడం ఖాయం. పవన్ వీరాభిమాని, టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్, పవన్ ను ఈ పేరుతోనే పిలుస్తుంటాడు. పవన్ ని దేవుడు అని, దేవర అంటూ సంబోధిస్తూ అందరికీ అలవాటు చేశాడు కూడా. ఈ దేవర అనే పదాన్ని పవన్ సినిమాకు దేనికైనా టైటిల్ గా వాడుకుంటే బావుంటుందని కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు.
సాయి ధరమ్ తేజ్, పవన్ నటిస్తున్న సినిమాకు ఈ టైటిల్ సరిపోతుందని, ఈ టైటిలే దాదాపు ఖాయం కావొచ్చని వార్తలు కూడా వచ్చాయి కానీ ఆ టీమ్ వేరే టైటిల్ మీద దృష్టి పెట్టడంతో ఈ దేవర టైటిల్ పై ఇప్పుడు ఎన్టీఆర్30 యూనిట్ కన్నేసినట్లు తెలుస్తోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కోసం దేవర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సముద్ర తీరంలో ఉండే జనాన్ని కాపాడే రక్షకుడి పాత్రలో కనిపించనున్నాడట. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ అయితే సరిగ్గా సరిపోతుందని, మాస్ లోకి కూడా ఈ టైటిల్ బాగా రీచ్ అవుతుందని భావిస్తుందట ఎన్టీఆర్30 చిత్ర బృందం. ఈ మేరకు టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం.
ఒకవేళ ఈ టైటిల్ను ఎన్టీఆర్30కి ఫిక్స్ చేస్తే మాత్రం పవన్ ఫ్యాన్స్ నిరాశ పడతారనే చెప్పాలి. ఇదిలా ఉంటే భారీ బడ్జెట్లో, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే నేపథ్యంతో ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు కొరటాల. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.













