ఎన్టీఆర్30 డైలాగ్ లీక్.. గూస్బంప్స్ గ్యారెంటీ..
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాలతో చేస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల మీద నమ్మకంతో సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో ప్రతీదీ ఎంతో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
రీసెంట్గా ఈసినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని త్వరలోనే రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా నేషనల్ వైడ్ గా ఎన్టీఆర్ కు కొత్త ఫ్యాన్స్ ను తీసుకొచ్చేలా తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఓ డైలాగ్ లీక్ అయింది. భారీ అంచనాలతో వస్తున్న ఎన్టీఆర్ సినిమాలో కూడా డైలాగ్స్ విషయంలో కొరటాల స్పెషల్ కేర్ తీసుకున్నట్లు తెలుస్తుంది.
యుద్ధం తథ్యం అయితే కత్తి కన్నీళ్లు పెట్టినా కనికరించను అంటూ తారక్ చెప్పే డైలాగ్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ డైలాగ్ ఎన్టీఆర్ చెప్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి. దానికి తోడు సినిమా ఓపెనింగ్ రోజు కొరటాల మీరెన్ని అంచనాలైనా పెట్టుకోండి, సినిమా అంతకు మించి ఉంటుందని ఓపెన్ గా చెప్పేశాడు.
అలాంటి ప్రామిస్ కొరటాల చేయడం, ఈ డైలాగ్ లీకవడం, క్రేజీ కాంబినేషన్స్ సినిమాపై హైప్ పెంచుతున్నాయి. ఆల్రెడీ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, విలన్ గా సైఫ్ నటించనున్నాడు. 2024 సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.













