ఎన్టీఆర్, కొరటాల శివ NTR #30 వచ్చే నెలలో ప్రారంభం?
రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చ్ 18 కానీ, ఏప్రిల్ 28నా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల సమయాన్ని కేటాయించాడు తారక్. 2018లో అరవింద సమేతతో చివరిసారిగా థియేటర్లో సందడి చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ కారణంగా మరో సినిమా చేయలేదు. దీంతో గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేసేందుకు ఎన్టీఆర్ సిద్ధమయినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారట. వచ్చే నెలలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఆ దిశగా పనులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. యన్టీర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్, బ్యానెర్ల సంయుక్తంగా నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ యస్ సంగీతం వహిస్తున్నారు. కెరీర్ పరంగా ఎన్టీఆర్కి ఇది 30వ సినిమా. ఈ సినిమా అనంతరం ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు తారక్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.













