సితార సంస్థకు నోటీసులు
సంపత్ నంది దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ హీరోగా రానున్న సినిమా గాంజా శంకర్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఈ సినిమా ఆగిపోయిందని నెల రోజుల కిందటే వార్త వినిపించింది. ఈ వార్త నెట్టింట వైరల్ అయినా టీమ్ నుంచి మాత్రం ఎలాంటి స్పందనా లేదు.
ఇదిలా ఉంటే ఈ సినిమా యూనిట్ కు తాజాగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుంచి నోటీసులు వచ్చాయి. టైటిల్ తో పాటూ టీజర్ లో ఉన్న కంటెంట్ యూత్ ను పక్కదారి పట్టించే అవకాశమున్నట్లు కనిపిస్తోందని, బాధ్యత కలిగిన ఫిల్మ్ మేకర్స్ గా ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదని నిర్మాతలనుద్దేశించి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఒకవేళ నిజంగా ఈ సినిమా క్యాన్సిల్ అయి ఉంటే ముందే ఆ మాట చెప్పేసి యూట్యూబ్ నుంచి ఆ టీజర్ ను కూడా డిలీట్ చేసి ఉంటే ఎలాంటి తలనొప్పులు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు నోటీసులు రావడంతో కచ్ఛితంగా ఏదొక సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ క్యారెక్టర్ ను ఊర మాస్ గా, గాంజాతో వ్యాపారం చేసే తరహాలో డిజైన్ చేసినట్టు ముందు నుంచి టాక్ ఉంది. ఏదేమైనా ఇలాంటి టైటిల్స్ పెడుతున్నప్పుడు నిర్మాణ సంస్థలు జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటి నోటీసులకు సమాధానాలు చెప్పాల్సిన అవసరమొస్తుంది. మరి ఆ నోటీసులపై నిర్మాణ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.













