Sequels: సౌత్ సీక్వెల్స్ కోసం నార్త్ ఆడియన్స్ వెయిటింగ్
ఏదైనా ఒక కథను నమ్మితే దాని కోసం ఎంత బడ్జెట్ పెట్టడానికైనా టాలీవుడ్ నిర్మాతలు వెనుకాడరు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలొచ్చాయి. ముందు ఒక బడ్జెట్ తో సెట్స్ పైకి వెళ్లడం, ఆ తర్వాత అనుకోకుండా బడ్జెట్ విపరీతంగా పెరిగిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. బాహుబలి తర్వాత అది మరీ ఎక్కువైపోయింది.
బాహుబలి(baahubali) సినిమా వల్ల కేవలం టాలీవుడ్ స్థాయి మాత్రమే కాకుండా సౌత్ సినిమా స్థాయి మొత్తం పెరిగింది. ఈ నేపథ్యంలోనే మిగిలిన ఇండస్ట్రీలు కూడా కాస్త ధైర్యం చేసి భారీ బడ్జెట్ సినిమాలు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలకు దూరంగా ఉండే కన్నడ, మలయాళ ఇండస్ట్రీలు కూడా ఇప్పుడు వాటిపై కన్నేశాయి.
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కెజిఎఫ్(KGF), కెజిఎఫ్2(KGF2), కాంతార(Kanthara), కాంతార1(Kanthara1) సినిమాలతో పాటూ మలయాళ ఇండస్ట్రీ నుంచి లోక చాప్టర్1(Lokah chapter1) సినిమాకు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ రెండు ఇండస్ట్రీలు వాటి సీక్వెల్స్ ను భారీగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాయి. ఈ సినిమాల కోసం కేవలం సౌత్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా నార్త్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






