జాతిరత్నాలు2 ఉంటుందా? లేదా?
అప్పుడెప్పుడో పిట్టగోడ సినిమా తీసినా అది పెద్ద ఫలితాన్నివ్వలేదు. కానీ సడెన్గా నాగ్ అశ్విన్ వెనుక ఉండి డైరెక్టర్ అనుదీప్ కెవితో జాతిరత్నాలు సినిమా తీయించి అతి పెద్ద హిట్ కొట్టించాడు. వైజయంతి సినిమాస్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా ఓ లాఫింగ్ థెరపీ లాగా ఆ టైమ్ లో ప్రేక్షకులను ఫుల్గా నవ్వించేసింది. ఈ సినిమాతో డైరెక్టర్ అనుదీప్ కు చాలా మంచి పేరొచ్చింది. అసలు అనుదీప్ కనిపిస్తే చాలు కామెడీ అన్నట్లుగా ఉంటాడు. జాతి రత్నాలు సక్సెస్ మీట్లోనే జాతిరత్నాలు2 ఉంటుందని అనౌన్స్ చేశారు డైరెక్టర్ అనుదీప్. కానీ ఆ సినిమా గురించి ఇప్పటి వరకు ఊసే లేదు.
జాతిరత్నాలు జోగిపేట నుంచి హైదరాబాద్ ప్రయాణం అక్కడ అవస్థలుకాగా, ఈసారి జాతిరత్నాలు2 హైదరాబాద్ టు యూఎస్ ఎలా వెళ్లారు అక్కడేం చేశారన్నది కథగా అనుకుంటున్నారట. ఫన్ తో మళ్లీ ఆడియన్స్ని నవ్వించే ప్రయత్నం చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ జాతిరత్నాలు విషయంలో జరిగిన మ్యాజిక్ ఈ సీక్వెల్ విషయంలో కూడా రిపీట్ అవుతుందని చెప్పలేం.
వాస్తవానికి జాతిరత్నాలు లో పెద్దగా కథేం ఉండదు. కామెడీ వల్ల సినిమా నెట్టుకొచ్చింది తప్పించి కథ పరంగా చెప్పుకోవడానికేం లేదు. అందుకే మేకర్స్ ఈ విషయంలో కొద్దిగా ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. అసలే శివకార్తికేయన్ తో అనుదీప్ చేసిన ప్రిన్స్ డిజాస్టర్ అవడంతో జాతిరత్నాలు 2 సినిమా ఉన్నా కానీ దానికి చాలా టైం తీసుకుని జాగ్రత్తగా స్క్రిప్ట్ వర్క్ చేశాకే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట.













