బింబిసార సీక్వెల్ ఉన్నట్లేనా?
గతేడాది వచ్చిన టాలీవుడ్ పెద్ద హిట్లలో బింబిసార కూడా ఒకటి. ఎన్నో ఏళ్లుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా విజయం మంచి బూస్టప్ ఇచ్చింది. ఈ సినిమాకు శ్రీ వశిష్ఠ దర్శకత్వం వహించాడు. బింబిసారను కళ్యాణ్ రామ్ తన మార్కెట్‌ను మించి ఖర్చు పెట్టి నిర్మించాడు. ఈ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బడ్జెట్ కు రెట్టింపు వసూలు చేసింది.
సినిమా రిలీజ్ టైమ్ లోనే బింబిసారకు సీక్వెల్ ఉంటుందని దర్శకనిర్మాతలు చెప్పుకొచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్ర దర్శకుడు వశిష్ఠ సీక్వెల్ నుంచి తప్పుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నందుకు వశిష్ఠ పెద్దగా ఫీలవలేదు కానీ కాంట్రాక్ట్ బ్రేక్ చేసి ఈ సినిమా నుంచి వైదొలగినందుకు నిర్మాణ సంస్థకు నష్టపరిహారం చెల్లించాడని వార్తలొచ్చాయి.
దీంతో తన ఐడియాలు, ఇన్పుట్స్ బింబిసార2 కు వాడుకుంటే లీగల్ గా చర్యలు తప్పవని వశిష్ఠ ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఏదైనా సరే మొత్తానికి ఈ ప్రాజెక్ట్ లో వశిష్ఠ లేడని మాత్రం క్లారిటీ వచ్చింది. దీంతో ఇప్పుడు అసలు బింబిసార కు సీక్వెల్ ఉంటుందా లేదా అని ఇండస్ట్రీలో అనుమానాలొస్తున్నాయి. దానికి తోడు మొన్న కళ్యాణ్ రామ్ బర్త్ డే కు ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా రావడం కష్టమేనని అందరూ దాదాపుగా ఫిక్స్ అయిపోయారు.













