Hari Hara Veeramallu: ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్న వీరమల్లు మేకర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan Kalyan) హీరోగా నటిస్తున్న సినిమాల్లో హరి హర వీరమల్లు(Hari hara veeramallu) కూడా ఒకటి. ఎప్పుడో కరోనాకు ముందు మొదలైన ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే పూర్తైంది. లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుండటంతో వీరమల్లుపై ఫ్యాన్స్ కు కూడా కనీస ఆసక్తి లేకుండా పోతుంది. క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) మొదలుపెట్టిన ఈ సినిమాను ఆ తర్వాత జ్యోతి కృష్ణ(Jyothi Krishna) పూర్తి చేశాడు.
ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ కు మేకర్స్ ఎప్పటికప్పుడు కావాల్సినంత నిరుత్సాహాన్ని ఇస్తున్నారు. అసలు ఈ సినిమా గురించి అప్డేట్స్ విషయంలో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ పూర్తవక ముందుంటే సరే ఇప్పుడు షూటింగ్ పూర్తై రిలీజ్ కు రెడీ అవుతున్న టైమ్ లో కూడా ఈ ఆలస్యమేంటనేది వాళ్లకు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
వీరమల్లు నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు మేకర్స్ ఈ వీక్ లో ట్రైలర్ అప్డేట్ ఇస్తామని చెప్పారు. వీకెండ్ కూడా వచ్చింది కానీ మేకర్స్ నుంచి ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ మాత్రం రాలేదు. దీంతో ఫ్యాన్స్ మేకర్స్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలే షూటింగ్ లేటవడంతో వీరమల్లుపై బజ్ తగ్గితే మేకర్స్ ఇలాంటివి చేసి ఉన్న బజ్ ను కూడా పోగొడతారా అని వారిపై మండిపడుతున్నారు. నిధి అగర్వాల్(Niddhi Agerwal) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్(Bobby Deol) విలన్ గా నటిస్తుండగా కీరవాణి(Keeravani) వీరమల్లుకు సంగీతం అందిస్తున్నారు.