ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసిన మహేష్
త్రివిక్రమ్, మహేష్ కాంబోలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఉగాదికి ఈ మూవీ నుంచి టైటిల్, ఫస్ట్ లుక్ వస్తాయని ప్రచారం జరగడంతో ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ తీరా చూస్తే అలాంటిదేమీ లేకుండానే మహేష్ ఫ్యాన్స్ కు ఈ ఉగాది నిరాశాజనకంగా మారింది.
మరో రెండు నెలల్లో సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు వస్తుండటంతో మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ను ఆ రోజు రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారట. కృష్ణ చనిపోయాక వస్తున్న ఫస్ట్ బర్త్డే కావడంతో ఆ డే ను స్పెషల్ గా మార్చాలని మహేష్ అనుకుంటున్నాడట. కుదిరితే టీజర్ కూడా అదే రోజు రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
మహేష్ కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మొదటి విశేషాలను తన తండ్రి కృష్ణ జయంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందని మహేష్ భావించడాన్ని ఫ్యాన్స్ కూడా స్వాగతిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా ఫ్యాన్స్ తికమకలో ఉన్నారు.
మొదట్లో ఏప్రిల్ 28కు అనుకున్న ఈ సినిమా, ఆ తర్వాత ఇండిపెండెన్స్ డే వీక్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు11 అనుకున్నారు. కానీ ఇప్పుడు అది కూడా మారినట్లు తెలుస్తుంది. ఎప్పుడో పూర్తవాల్సిన సినిమా షూటింగ్ డిలే కారణంగా దసరాకైనా వస్తుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కాకుండా వచ్చే సంక్రాంతికి రావచ్చనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.













