డబుల్ ఇస్మార్ట్ కు నో టెన్షన్
సాధారణంగా ఫ్లాపుల్లో ఉన్న హీరో, డైరెక్టర్ కాంబోలో సినిమా వస్తుందంటే దానిపై బజ్ ఉండదు. కానీ డబుల్ ఇస్మార్ట్ సినిమాకు మాత్రం ఈ రూల్ వర్తించదు. మిస్టర్ బచ్చన్, తంగలాన్ సినిమాలతో పాటూ బాలీవుడ్ లో స్త్రీ2, ఖేల్ ఖేల్ మే, వేదా సినిమాలు అదే రోజు డబుల్ ఇస్మార్ట్ కు పోటీగా రిలీజ్ అవుతన్నప్పటికీ క్రేజ్ పరంగా ఈ సినిమానే ఓ అడుగు ముందుంది.
డబుల్ ఇస్మార్ట్ థియేట్రిక్ రైట్స్ రూ.60 కోట్లకు అమ్ముడుపోగా, ఓటీటీ రైట్స్ ను రూ.33 కోట్లకు ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆడియో, హిందీ డబ్బింగ్ రైట్స్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్నీ కలిపి రూ.50 కోట్ల వరకు రావొచ్చంటున్నారు. ఈ సినిమాకు ఇంత భారీ మొత్తంలో ఆఫర్లు రావడం చూస్తే ఇస్మార్ట్ శంకర్ ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికే డబ్బింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆగస్ట్ మొదటి వారానికల్లా సెన్సార్ పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలని ట్రై చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్, మీడియా ఇంటర్వ్యూలు బోలెడు కవర్ చేయాల్సి ఉంది. రిలీజ్ కు ఇంకా 18 రోజులు మాత్రమే టైముంది. కానీ టెన్షన్ పడాల్సిన పనేమీ లేదు. అన్నీ ప్లానింగ్ ప్రకారం జరిగిపోతున్నాయని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్, ప్రోమోలు అన్నీ సినిమా పై హైప్ ను పెంచేలానే ఉన్నాయి. ఆ అంచనాలను ట్రైలర్ ద్వారా మరింత పెంచాలని ట్రై చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా రిజల్ట్ పైన పూరీ కెరీర్ ఆధారపడి ఉంటుంది.













