సలార్ లో అవేమీ ఉండవట..
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఇంకో నలభై రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్నప్పటికీ చిత్ర మేకర్స్ సినిమా ప్రమోషన్లని ఇంకా మొదలుపెట్టలేదు. ఈ మౌనం వెనుక కారణమేంటన్నది ఎవ్వరికీ అంతుచిక్కట్లేదు.
ఇదిలా ఉంటే సలార్ టీమ్ నుంచి ఓ షాకింగ్ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. సలార్ సినిమాలో పాటలేమీ ఉండవని, కేవలం మెయిన్ సాంగ్ మాత్రమే ఉంటుందని సమాచారం అందుతుంది. సినిమా మొత్తం మీద మూడు బిట్ సాంగ్స్ ఉంటాయని, అవి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లా వచ్చి పోతాయని తెలుస్తోంది.
ఉన్న ఆ ఒక్క పాట కూడా సెంటిమెంట్ సాంగ్ అని సమాచారం. ఈ విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే సలార్ ప్రమోషన్లు మొదలుపెట్టలేదని ఫీల్ అవుతున్న ఫ్యాన్స్‌కు ఈ వార్త మింగుడు పడటం లేదు. ఇందులో నిజమెంతున్నది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే సలార్ ప్రమోషన్స్ విషయంలో కూడా మేకర్స్ చాలా డల్ గా ఉన్నారు. కేజీఎఫ్2 టైమ్ లో ఫుల్ హడావిడి చేసిన మేకర్స్ ఈ సినిమా విషయంలో మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉన్నరనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు సాంగ్స్ కూడా లేకుండా డైరెక్ట్ గా ట్రైలర్ రిలీజ్ అంటున్నారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రమోషన్స్ ను మొదలు పెడతారని అంటున్నారు. మరి అంత తక్కువ టైమ్ లో సినిమాకు ఏ మేర బజ్ తీసుకొస్తారో చూడాలి.













