ఆ ట్రెండ్‌లో రామ్ చరణ్ లేడు
టాలీవుడ్ లో సీక్వెల్స్, రెండు భాగాల ట్రెండ్ నడుస్తోందిప్పుడు. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ ను ఆ తర్వాత కేజీఎఫ్, పుష్ప సినిమాలు కంటిన్యూ చేస్తూ వచ్చాయి. దీంతో ఈ ట్రెండ్ బాగుందని, మిగిలిన హీరోలు కూడా ఈ బాట పడుతున్నారు. ఒక కథను రెండు సినిమాలుగా రిలీజ్ చేస్తే క్రేజ్‌తో పాటూ కమర్షియల్ గా కూడా లాభం ఉంటుందని నిర్మాతలు కూడా దీనికి సై అంటున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున నటిస్తున్న పుష్ప2 సెట్స్ పై ఉంటే, ఎన్టీఆర్- కొరటాల కాంబోలో రానున్న దేవర కూడా రెండు పార్టులుగా వస్తుందని రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ప్రభాస్ సలార్ రెండు భాగాలుగా రిలీజ్ కానున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేశారు. దీంతో పాటూ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న కల్కి సినిమా కూడా రెండు భాగాలుగానే రానుంది.
పవన్ కళ్యాణ్ ఓజీ రెండు పార్టులుగా రావడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. రాజమౌళితో మహేష్ చేయనున్న సినిమా కూడా రెండు భాగాలుగా రిలీజ్ కానుందని ఇప్పటికే చెప్పారు. బాలకృష్ణ అఖండ కు సీక్వెల్ గా అఖండ2, రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమాలు అనౌన్స్ చేశారు. టాప్ హీరోల్లో ఈ లిస్ట్ లో ఇంకా చేరని హీరో ఎవరంటే రామ్ చరణ్. మరి ఈ ట్రెండ్‌ను రామ్ చరణ్ ఎప్పటినుంచి ఫాలో అవుతాడో చూడాలి.













