కొత్త పోస్టర్ లో రిలీజ్ డేట్ ఎందుకు లేదు?
నిన్న శివరాత్రి సందర్భంగా చాలా సినిమాల నుంచి అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. అందులో ఎక్కువగా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది కల్కి సినిమా నుంచి రిలీజైన ప్రభాస్ లుక్. ఇప్పటికే ఈ సినిమా నుంచి మొదట్లో ప్రభాస్ ది ఓ లుక్ రిలీజ్ చేశారు. కానీ ఆ లుక్ లో ప్రభాస్ బాలేకపోవడంతో విపరీతమైన ట్రోలింగ్ కు గురయ్యాడు.
ఇక శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో మాత్రం ప్రభాస్ క్యారెక్టర్ నేమ్ ను రివీల్ చేస్తూ ఓ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ విషయంలో ఫ్యాన్స్ చాలా శాటిస్ఫైయింగ్ గా ఉన్నారు. కానీ రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ మీద రిలీజ్ డేట్ లేకపోవడం ఫ్యాన్స్ కు పలు అనుమానాలను కలిగిస్తోంది. ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.
మధ్యలో సినిమా వాయిదా పడుతుందని వార్తలొచ్చినప్పటికీ చిత్ర బృందం మాత్రం మే 9నే తమ సినిమా రిలీజవుతుందని నొక్కి మరీ చెప్పింది. రిలీజ్ డేట్ విషయంలో అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు కొత్త పోస్టర్ లో రిలీజ్ డేట్ ను ఎందుకు వేయనట్టు అని సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఏదో మాట వరసకి సినిమా చెప్పిన డేట్ కు వస్తుందని చెప్తున్నప్పటికీ రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ కూడా కాన్ఫిడెంట్ గా లేరట. షూటింగ్ చివరి దశలో ఉన్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ అనుకున్నట్లు పూర్తవుతాయా లేదా అనే అనుమానంతోనే పోస్టర్ పై డేట్ వేయలేదని తెలుస్తోంది. తాము అనుకున్నట్లు అవుట్ పుట్ వస్తే సినిమా చెప్పిన తేదీకే వస్తుంది లేదంటే మాత్రం కల్కి మరో కొత్త డేట్ ను వెతుక్కోవాల్సిందే.













