అస్తమానం అవే పోస్టర్లా శంకర్ సార్..!
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ సినిమా డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజవుతుందని నిర్మాత దిల్ రాజు చెప్పిన దగ్గరనుంచి ఫ్యాన్స్ కు ఊపిరాడటం లేదు. రిలీజ్ కు మరో 4 నెలలే టైముందని ఇప్పటినుంచే మేకర్స్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయాలని కోరుతున్నారు.
కానీ మేకర్స్ మాత్రం అసలు ప్రమోషన్స్ గురించి ఆలోచించడం లేదు. హీరోయిన్ కియారా బర్త్ డే సందర్భంగా ఆమె పాత్రను రివీల్ చేస్తూ హీరోతో కలిసి ఉన్న ఫోటోను ఏమైనా రిలీజ్ చేస్తారనుకుని ఎన్నో ఊహించుకున్న ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. జరగండి సాంగ్ లోని కియారా స్టిల్ ను రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ చెప్పారు.
ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజైన కంటెంట్ ఏదైనా ఉందా అంటే అది జరగండి సాంగ్, అందులోని స్టిల్స్ మాత్రమే. మేకర్స్ రిలీజ్ చేసిన దానికంటే లీకైన ఫోటోల ద్వారానే కొత్త స్టిల్స్ చూశామని, ఒకే సాంగ్ నుంచి అస్తమానం అవే పోస్టర్లు రిలీజ్ చేయడం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెప్పుకోడానికే నాలుగు నెలలు టైమ్ కానీ గేమ్ ఛేంజర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాకు బజ్ పెంచాలంటే ఇప్పటినుంచే మేకర్స్ ప్రమోషన్స్ ను ఓ ప్లానింగ్ ప్రకారం చేయాలి. కానీ శంకర్ దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు లేడు.













