పుష్ప2 పోస్ట్పోన్పై ఆశలొద్దు
ఈ ఇయర్ ఆగస్ట్ 15 మీద చాలా పెద్ద సినిమాలే కన్నేశాయి. దానికి రీజన్ ఒకటి. ఇప్పటికే ఆ డేట్ కు షెడ్యూల్ అయిన పుష్ప2 సినిమా వాయిదా పడుతుందని అందరూ ఆశ పడుతున్నాయి. పుష్ప2 వాయిదా అన్న వార్త రాగానే మిగిలిన వారు తమ తమ సినిమాల రిలీజ్ డేట్ లను అనౌన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు.
కానీ పుష్ప2 టీమ్ మాత్రం రిలీజ్ డేట్ విషయంలో తగ్గేదేలే అంటూ ఎప్పటికప్పుడు ఆగస్ట్ 15న వస్తున్నామని నొక్కి వక్కాణిస్తుంది. రీసెంట్ గా పుష్ప2 సెట్స్ లో సుకుమార్ ఫోటోను క్లిక్ చేసింది రష్మిక. దాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తమ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేస్తూ ఆగస్ట్ 15 రిలీజ్ డేట్ ను మరోసారి స్పష్టంగా చెప్పారు.
ఎట్టి పరిస్థితుల్లో సినిమాను చెప్పిన తేదీకి తీసుకురావాలని మేకర్స్ చాలా వేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ కాపీని జులై ఆఖరికి రెడీ చేయాలని సుకుమార్ చూస్తున్నాడట. నెట్ఫ్లిక్స్ తో ఇప్పటికే ఆగస్ట్ 15 రిలీజ్ డేట్ కు అనుగుణంగా డీల్ కుదుర్చుకున్నారు కాబట్టి ఆ డేట్ ను మిస్ అవకూడదని మేకర్స్ అన్ని విధాల కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.













