Telangana: పుష్ప2 ఎఫెక్ట్- తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలకు నో పర్మిషన్
తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో ఇకపై రిలీజయ్యే సినిమాలకు బెనిఫిట్ షోలను నిషేధిస్తున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి(Komatireddy Venkatreddy) అనౌన్స్ చేయడం ఇప్పుడ హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా పుష్ప2(Pushpa2) రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్(RTC Cross Rads) లోని సంధ్య 70ఎంఎం(Sandhya 70MM) థియేటర్లో జరిగిన తోపులాటలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కొడుకి పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారింది.
తన అభిమానుల ఆనందాన్ని డైరెక్ట్ గా చూడ్డానికి అక్కడికి అల్లు అర్జున్(Allu Arjun) రావడం వల్ల ఒక్కసారిగా తోపులాట పెరిగిపోయి ఈ విషాదం చోటు చేసుకుంది. బన్నీ(Bunny)తో పాటూ దీనికి బాధ్యులైన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేయడంతో రాబోయే పాన్ ఇండియా సినిమాలకు భారీ దెబ్బ పడే ఛాన్సుంది.
దానికి కారణం సంక్రాంతి(Sankranthi)కి రానున్న గేమ్ ఛేంజర్(Game Changer), డాకు మహారాజ్(Daku Maharaj), సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమాలు భారీ క్రేజ్ తో రిలీజ్ కానున్నాయి. పుష్ప2 కు ఇచ్చినట్టే తమ సినిమాలకు కూడా ప్రభుత్వం ఎక్స్ట్రా షో లకు పర్మిషన్స్ తో పాటూ టికెట్ రేట్లకు మంచి పెంపు ఇస్తారని నిర్మాతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు బెనిఫిట్ షోలు లేకుండా కేవలం రెగ్యులర్ షోలు మాత్రమే అంటే కలెక్షన్లకు భారీ గండి పడుతుంది. మరి ఈ బ్యాన్ ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.













