బాగున్న సినిమాను ఎవరూ ఆపలేరు – దిల్ రాజు
గుంటూరు కారం సినిమాకు మిక్డ్స్ టాక్ రావడంతో చిత్ర నిర్మాత నాగవంశీ, నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు స్పెషల్ గా మీడియా ముందుకొచ్చారు. రీసెంట్ గా జరిగిన పరిణామాల గురించి కొంత వరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారిద్దరూ. ప్రతీ ఏడాది సంక్రాంతికి ఇలాంటి పంచాయితీలు మామూలేనని దిల్ రాజు అన్నారు.
ఇండస్ట్రీలో మిత్రులు శత్రువులు అంటూ ఎవరూ ఉండరని, ఎవరికి వారే పెట్టుబడి పెట్టిన వాళ్లు దాన్ని కుదిరినంత త్వరగా వెనక్కు రాబట్టుకోవాలని చూస్తుంటారని, దాని కోసమే వ్యాపారం చేస్తారు కానీ కావాలని ఎవరినీ తొక్కేయాలని కాదనే విషయాన్ని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. మిడ్ నైట్ షోల తర్వాత కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ మార్నింగ్ షో నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారని దిల్ రాజు చెప్పాడు.
సుదర్శన్ లో రెండోసారి గుంటూరు కారం చూడ్డానికి వెళ్లినప్పుడు తనకు ఈ విషయం అర్థమైందని, బాగున్న సినిమాను ఎవరూ ఆపలేరని నొక్కి మరీ క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి గుంటూరు కారం సినిమా రూ.94 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందని గుంటూరు కారం మేకర్స్ ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తుంటే షేర్ రూపంలో ఎంత లేదన్నా 45 కోట్ల దాకా వస్తుంది. బుధవారం వరకు సినిమా బాగా పెర్ఫార్మ్ చేస్తే గుంటూరు కారం బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సుంది.













