సినిమా టైటిల్స్ లీకులపై కఠిన నిర్ణయం తీసుకున్న నిర్మాతలు!
ఇప్పటివరకు ఫిలింఛాంబర్ నుంచి నెలవారీ బులెటిన్ విడుదల అవ్వటం అందులో మునుముందు రానున్న సినిమాలకు సంబంధించిన టైటిల్స్ ఇవీ అంటూ ప్రచారం జరుగుతూ ఉండేది. ఇలా లీకుల ఇవ్వటం వల్ల, తమ సినిమా మొదలవ్వకముందే పాలన సినిమా టైటిల్ ఇదే అని ప్రచారం జరగటం నిర్మాతలకి పెద్ద తలనొప్పి తెచ్చిపెడుతోంది. కానీ ఇకపై అది రిలీజ్ కాదని తెలిసింది. ఇకపై తాము రిజిస్టర్ చేసిన టైటిల్ ను మీడియాకు తెలియచేయవద్దంటూ ఫిల్మ్ ఛాంబర్ ను నిర్మాతలు కోరారట. దీనివల్ల ఇక మీదట ఫిలిం ఛాంబర్ నుండి అధికారికంగా మాత్రం రిజిస్టర్ అయిన సినిమాల టైటిల్స్ బయటకు రానట్లే.
నిజానికి పెద్ద హీరోల సినిమాలకు టైటిల్స్ ఇవీ అంటూ మీడియాలో బోలెడంత హంగామా ఉంటుంది. టైటిల్ లాంచింగ్ అధికారికం కాకముందే చాంబర్ నుంచి లీకుల వల్లనే మీడియాకి తెలిసిపోతోంది. ఒక్కోసారి సోషల్ మీడియాలో టైటిల్ లీక్ అయితే… తంటాలు మొదలవుతాయి. తమ హీరోకు ఆ టైటిల్ పెట్టొద్దు బాగోలేదనో, ఫలానా టైటిల్ పెట్టమనో నిర్మాత మీద సదరు హీరో ఫ్యాన్స్ ఒత్తిడి చేస్తారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
ఇకపై పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అనే తేడా లేకుండా అసలు టైటిల్ అన్నది బయటికి చెప్పరట. ఏదేమైనా ఇది నిర్మాతలకు కలిసివచ్చే విషయమే, వారు అభిమానుల నుండి ఇకపై ఎలాంటి ఒత్తిడులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ప్రతిదీ అధికారికంగా ప్రకటించాకే ఇతర ప్రచార హడావుడికి ఆస్కారం ఉంటుంది. కానీ కొందరు వీటిని లీక్ చేసే ఆస్కారం కూడా లేకపోలేదు. మరి దీనిని ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి.













