టాలీవుడ్ లో ఇకపై ఐటెం సాంగ్ లేకుండా సినిమాలు
సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేయాలి అంటే ఆ ఐటెం సాంగ్ విషయంలో నానా కష్టాలు పడాల్సి ఉంటుంది. సాంగ్ రికార్డింగ్ నుండి అది షూట్ చేసాయడానికి సెట్ డాన్స్ మాస్టర్ ట్రూప్ డాన్సర్లు అన్నిటికి మించి ఓ టాప్ హీరోయిన్ ట్రైల్స్ అది ఎవరు అయినా సరే అంతే. హీరోలు అయినా దర్శక నిర్మాతలు అయినా సరే ఐటెం సాంగ్ కోసం చాలా తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు.
ఐటెం సాంగ్ చేయడం అనేది సాదా సీదాగా అయితే ఉండదు అనే మాట అందరికి తెలిసిన విషయమే. అందుకే ఐటెం సాంగ్స్ విషయంలో టాలీవుడ్ లో కాస్త భయాలు కూడా ఉంటాయి అనేది కొందరి మాట. చాలా మంది దర్శక నిర్మాతలు ఐటెం సాంగ్స్ విషయంలో భయపడుతూ వాటిని లైట్ కూడా తీసుకుంటారు. ఇక తప్పదు అనుకుంటే మాత్రమే వాటిని ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన తెలుగులో ఐటెం సాంగ్స్ ని అసలు వద్దు అని టాలీవుడ్ హీరోలు అంటున్నారు. ఐటెం గర్ల్ కోసం ఖర్చు చేయాలి ఆ పాట కోసం భారీగా ఖర్చు చేయాలి, సాదా సీదా హీరోయిన్ అయితే సాధ్యం కాదు.
అందుకే ఇప్పుడు ఐటెం సాంగ్స్ ని అసలు వద్దు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఏ హీరో అయినా సరే ఐటెం సాంగ్స్ విషయం లో ఆసక్తి చూపించడం లేదు అనే మాట ఎక్కువగా వినపడుతుంది. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ ఐటెం సాంగ్ ని వద్దు అని చెప్పేసాడు.
అదే విధంగా మరి కొంత మంది కూడా ఇదే విధంగా ఐటెం సాంగ్స్ విషయంలో అవసరం లేదు అనే భావన లో ఉన్నారు అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. ఖర్చు తగ్గించే ఆలోచనలో ఉన్న స్టార్ హీరోలు ఐటెం సాంగ్ లేకపోయినా సరే సినిమాను ప్రజల్లోకి తీసుకుని వెళ్తామని చాలా నమ్మకంగా చెప్తున్నారట. ప్రతీ సినిమాలో ఐటెం సాంగ్ పెట్టె సుకుమార్ ఈ నిర్ణయానికి ఏమంటాడో? మరి మాస్ ప్రేక్షకులకు ఈ ఊసు నచ్చుతుందో లేదో.













