ఆ సినిమాలో నటించట్లేదు : పాయల్
గత ఏడాది వచ్చిన ఆర్ ఎక్స్ 100 సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. ఇందులో జంటగా నటించిన కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే హీరోగా కార్తికేయకు వచ్చినన్ని అవకాశాలు పాయల్‌కు రాలేదని చెప్పవచ్చు. కమర్షియల్ చిత్రాల నాయికగా బిజీ అవుతుందని అంతా భావించారు. సీనియర్ హీరోలు బాలకృష్ణ, రవితేజ సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే విడుదలైన సీత సినిమాలో ఓ ప్రత్యేక గీతం చేసింది. తాజాగా ప్రభాస్ సాహోలో కూడా పాయల్ స్పెషల్ సాంగ్ చేయనుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఈ వార్తలో నిజం లేదని పాయల్ తోసిపుచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తొలి చిత్రం మంచి సక్సెస్ అయితే సహజంగానే గుర్తింపు రావాలి. కానీ పంజాబీ భామ పాయల్‌కు మాత్రం అలాంటి అవకాశాలు రాలేదు. యువహీరోలతో కలిసి నటిస్తేనే కెరీర్ ముందుకు సాగుతుందనే విషయం ఆమెకు తెలియంది కాదు. కానీ అవకాశాలే రావడం లేదని తెలిసింది.













