ధనుష్ మైల్ స్టోన్ సినిమాకు తెలుగులో నో బజ్
తమిళ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో చేసిన రాయన్ మూవీ రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ధనుష్ కెరీర్ లో 50వ సినిమాగా వస్తోంది. పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్డ్స్ స్టోరీగా వస్తున్న రాయన్ ట్రైలర్ కు తమిళంలో భారీ హైప్ నెలకొని ఉంది.
తమిళ ఆడియన్స్ ఇలాంటి మాస్ కథలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఇదిలా ఉంటే తెలుగులో మాత్రం రాయన్ కు ఎలాంటి బజ్ లేదు. ట్రైలర్ లో ఎక్కువగా తమిళ నేటివిటీ కనిపించడంతో టాలీవుడ్ ఆడియన్స్ కు పెద్దగా ఎక్కలేదు. రాయన్ సినిమాతో తెలుగులో మంచి సక్సెస్ అందుకుని దాన్ని కుబేరకు వాడుకోవాలని చూస్తున్నాడు ధనుష్.
కానీ ప్రస్తుతం రాయన్కు తెలుగులో పెద్దగా హైప్ లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా తక్కువగా జరిగాయి. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్పించి రాయన్ కు తెలుగులో ప్రమోషన్స్ చేయలేదు. దీంతో చాలా మందికి రాయన్ సినిమా రిలీజ్ అవుతుందని కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. సినిమాకు మంచి టాక్ వస్తుందని దాంతో ఆడియన్స్ థియేటర్లకు వస్తారని ఎంతో నమ్మకంగా ఉన్నారు రాయన్ మేకర్స్. మరి ఈ మైల్ స్టోన్ సినిమా ధనుష్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













