బాలకృష్ణ, బోయపాటి శ్రీను చిత్రానికి హీరోయిన్లు కరువయ్యారు
నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న #బి బి 3, ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ల విషయంపై పలు వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాలో హీరోయిన్లుగా పలువురి పేర్లు రౌండ్ అయ్యాయి. శ్రియ, అంజలి పేర్లు ప్రధానంగా రౌండ్ అయ్యాయి. అయితే.. బోయపాటి మళయాళం నుంచి ప్రగ్యా మార్టిన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు పలువురి పేర్లు వినిపించినా చివరకు పూర్ణను ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ విషయంపై ఎటువంటి అఫిషియల్ న్యూస్ లేకపోయినా.. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో రౌండ్ అవుతోంది.
ఇప్పటికే బాలయ్య పాత్రతో రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈమధ్య తెలుగులో సీనియర్ హీరోలకు హీరోయిన్ల సమస్య వస్తోంది. ఆక్రమంలో బాలయ్య కూడా ఈమధ్య పలువురు సీనియర్ హీరోయిన్లతోనే సినిమాలు చేశారు. ఇప్పుడు బోయపాటి సినిమాకు కూడా ఇదే సమస్య వస్తోంది. ఈనెల 16 నుంచి రామోజీ ఫిలిం సిటీలో పాటతో షెడ్యూల్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. మరి.. ఈసారైనా హీరోయిన్లు వీరేనంటూ వస్తున్న వార్తలు నిజమవుతాయో లేదో చూడాలి.













