Ramayana: రామాయణ స్టార్లకు మీడియా ముందుకు నో ఎంట్రీ?

నితేష్ తివారీ(nitesh tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ(ramayana) రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్(Ranbir kapoor) రాముడిగా, సాయి పల్లవి(sai pallavi) సీతగా, యష్(yash) రావణాసురుడిగా నటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం రామాయణ మేకర్స్ ఓ మంచి ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. 2026 దీపావళికి సినిమా రిలీజయ్యే వరకు అందులో నటిస్తున్న మెయిన్ క్యాస్టింగ్ ఎలాంటి కాంట్రవర్సీల్లో చిక్కుకోకుండా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు.
అందులో భాగంగానే సినిమాతో సంబంధమున్న ప్రతీ ఒక్కరూ మీడియాతో మాట్లాడకుండా ఉండాలని మేకర్స్ వారికి చెప్పారంటున్నారు. ఆల్రెడీ సాయి పల్లవి, రణ్‌బీర్ కపూర్ కొందరి మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వివాదాల్లో ఉన్నప్పటికీ మీడియా ముందుకొచ్చి మీడియాతో మాట్లాడితే అది మరిన్ని వివాదాలకు దారి తీస్తుందని మేకర్స్ కంగారు పడుతున్నారు.
గతంలో జరిగిన కొన్ని పరిస్థితుల నుంచి నిర్మాతలు ఈ గుణపాఠాన్ని నేర్చుకున్నారనిపిస్తుంది. అయితే ఇది మాత్రమే కాకుండా సినిమాలోని అన్ని పాత్రల ఫస్ట్ లుక్స్, క్యారెక్టర్ల విషయంలో కూడా డైరెక్టర్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. కాగా రెండు భాగాలుగా రిలీజ్ కానున్న రామాయణ మొదటి భాగం 2026 దీపావళికి రిలీజ్ కానుండగా, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానుంది.