దాని వల్ల మీనాక్షికి ఏం నష్టం లేదు
గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి నటిస్తుందని తెలిసినప్పుడు ఇన్నాళ్లకు అమ్మడుకు పెద్ద స్టార్ సినిమాలో ఆఫర్ వచ్చిందిలే అని అందరూ సంతోషించారు. కానీ ఆ సినిమా రిలీజ్ తర్వాత అసలు మీనాక్షి ఈ సినిమా ఎందుకు ఒప్పుకుందా అని అనుకున్నారు. సినిమా లో ఆమెది అసలు ప్రాధాన్యం ఉన్న పాత్రే కాదు.
కానీ గుంటూరు కారం ఎఫెక్ట్ ఏమీ మీనాక్షి కెరీర్ మీద పడలేదు. ప్రస్తుతం అమ్మడి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో మీనాక్షినే హీరోయిన్. దీంతో పాటూ వరుణ్ తేజ హీరోగా తెరకెక్కుతున్న మట్కా, విశ్వక్సేన్10. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న లక్కీ భాస్కర్ లో కూడా మీనాక్షినే హీరోయిన్.
ఇవి కాకుండా తాజాగా చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభర మూవీలో దేవ కన్య పాత్ర కోసం మీనాక్షిని తీసుకున్నారని వార్తలొస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే గుంటూరు కారం ఎఫెక్ట్ మీనాక్షిపై ఏ మాత్రం పడలేదని అర్థమవుతోంది. టాలీవుడ్ లో శ్రీలీల డిమాండ్ క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో మీనాక్షికి సరిగ్గా రెండు హిట్లు పడితే ఆ స్థానాన్ని అమ్మడు రీప్లేస్ చేయడం ఖాయం.













