హిట్లున్నా ఛాన్స్‌లు ఎందుకు రావట్లేదు?
తెలుగులో చేసిన నాలుగు సినిమాలు మంచి హిట్ అవడంతో మలయాళ భామ సంయుక్త మీనన్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. భీమ్లా నాయక్ సినిమాలో నటించిన సంయుక్త ఆ తర్వాత చేసిన బింబిసార, సార్, విరూపాక్ష సినిమాలు కూడా మంచి హిట్ అవడంతో ఆమె లక్కీ హీరోయిన్ గామారింది. మలయాళంలో కూడా తనదైన నటనతో ఆకట్టుకుంటున్న సంయుక్తకి తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రం ఈ రేంజ్ క్రేజ్ ను ఊహించలేదు.
విరూపాక్ష తర్వాత కళ్యాణ్ రామ్ తో డెవిల్ లో నటిస్తున్న సంయుక్త ఆ తర్వాత మరో సినిమాకు సైన్ చేసింది లేదు. ఛాన్సులు రావట్లేదా లేదా తనను మెప్పించే కథ తన దగ్గరకు రావట్లేదా అన్నది మాత్రం తెలియదు కానీ డెవిల్ తర్వాత సంయుక్త ఏ సినిమాకు కమిట్ కాలేదనేది మాత్రం వాస్తవం. వరుస హిట్లతో ఉన్నా సరే అమ్మడి కెరీర్ కి బ్రేక్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
దీనికి కారణం సంయుక్త తన పాత్రకు ప్రాధాన్యత, కథా బలం ఉంటేనే ఓకే చేయడమే అని తెలుస్తోంది. అంతేకాదు గ్లామర్ రోల్స్ కోసమైతే తన దగ్గరకు రావొద్దని నిర్మొహమాటంగా చెప్తుందట సంయుక్త. అందుకే సంయుక్తకు ఆఫర్స్ రావట్లేదా అని కొందరు అనుకొండుండగా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి ఉన్న ఇమేజ్ ను పాడు చేసుకోవడం కంటే సెలెక్టివ్ గా సినిమాలు చేయడమే బెటర్ అనుకుంటుంది సంయుక్త.













