పుష్ప.. ఇక్కడితో ఆగేలా లేడు
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమా భారీ అంచనాలతో వస్తోంది. చూస్తుంటే ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ వెబ్ సిరీస్ అయ్యేలా కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం పుష్ప సినిమా రెండు భాగాలతో ఆగేలా లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ది రూల్ పేరుతో సెకండ్ పార్ట్ తెరకెక్కుతుండగా, ఆఖరి పార్ట్ గా ది రోర్ పేరుతో ఎండ్ చేయాలని చూస్తున్నాడట సుకుమార్.
దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఇప్పటికే బన్నీ, సుక్కూ, నిర్మాతలు ఓకే అనుకున్నారట. సుకుమార్ గతంలోనే దీన్ని వెబ్ సిరీస్ కు సరిపడే లెంగ్త్ తో రాసుకున్నానని, కానీ బన్నీకి నచ్చడంతో సినిమా నిడివికి తగ్గట్టు మార్చినట్లు చెప్పుకొచ్చాడు. ఫ్రెష్ గా సినిమా అవుట్పుట్ ను ఎప్పటికప్పుడు చూసుకుంటున్న సుకుమార్ ఈ సినిమాను మరింత విస్తరించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
మరి దీని అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తుందో చూడాలి. ఎందుకంటే పుష్ప2 కోసమే బన్నీ ఎంతో కాలంగా లాంగ్ హెయిర్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు అది తీసేసి వేరే సినిమాలు చేసి మళ్లీ లాంగ్ హెయిర్ పెంచేంత టైమ్ బన్నీ దగ్గర లేదు కాబట్టి ఏది చేసినా ఇప్పుడే చేయాలి. ఇలాంటి నేపథ్యంలో మరి పుష్ప3 ఉంటుందా లేదా కొంత టైమ్ తీసుకుని బన్నీ కమిట్మెంట్స్ పూర్తయ్యాక పుష్ప3 చేయనున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే పుష్ప2 ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.













