షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ నిరాకరణ
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను ఎస్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఉన్న ఆర్యన్‌ను వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో ఆర్యన్ తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా కోర్టు ఆర్యన్‌కు బెయిల్ నిరాకరిస్తూ ఆ పిటిషన్‌ను కొట్టి వేసింది. కాగా ఆర్యన్‌ను ఈ నెల 7వ తేదీ వరకు కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఎస్సీబీ కోర్టును కోరింది. ఆర్యన్‌తో పాటు అర్భజ్ మర్చంట్, మున్మున్ ధమేచతో పాటు మిగిలిన వారు ప్రస్తుతం పోలీసులు కస్టడీలో ఉన్నట్లు తెలుస్తోంది. ముంబై తీరంలో ఒక క్రూజ్‌లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం, విక్రయం వ్యవహారంలో ఆర్యన్ ఖాన్ సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.













