సూపర్ స్టార్ కూతురుగా నివేదా థామస్?
పేట తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ తన 166వ చిత్రాన్ని ఎఆర్ మురుగదాస్‌తో చేయనున్నారని తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 10 నుంచి ప్రారంభమైంది. ఇక ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ నివేదా థామస్, రజనీ కూతురుగా కన్పించనుందని సమాచారం. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రజనీ పోలీస్ ఆఫీసర్‌గా నటించనుండగా, ఆయనకు జోడీగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించనుంది. వీరితోపాటు రజనీ ఫ్రెండ్ పాత్రకు ఎస్‌జె సూర్యను తీసుకున్నారని తెలిసింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది.













