Puri Jagannadh: పూరీ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్
డబుల్ ఇస్మార్ట్(double ismart) తర్వాత పూరీ జగన్నాథ్(puri jagannadh) ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ అనుకుంటున్న టైమ్ లో ఎవరూ ఊహించని విధంగా పూరీ విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో సినిమాను అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమా కథ తనకెంతో నచ్చిందని, ఈ సినిమాలో యాక్టింగ్ కు చాలా స్కోప్ ఉందని ఇప్పటికే సేతుపతి క్లారిటీ ఇచ్చాడు.
ఈ సినిమా కోసం ఆల్రెడీ టబు(Tabu), రాధికా ఆప్టే(Radhika Apte)ని లాక్ చేసుకున్న పూరీ జగన్నాథ్ ఇప్పుడు మరో హీరోయిన్ ను ఎంపిక చేయడానికి ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పూరీ, నివేదా థామస్(nivetha thomas) ను కలిసి కథ చెప్పాడని టాక్. నివేదా ఓకే చెప్పిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఓకే చెప్తే మాత్రం నివేదాకు ఇది చాలా మంచి ఆఫరే అవుతుంది.
లైగర్(liger), డబుల్ ఇస్మార్ట్ లతో డిజాస్టర్లు అందుకున్న పూరీ ఈ సినిమాను ఎంతో కసిగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం పూరీ తన ఒకప్పటి స్పీడ్ ను కూడా ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. కేవలం రెండు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్ తో ఉన్నాడట పూరీ. దానికి అనుగుణంగానే సేతుపతి డేట్స్ ను కూడా పూరీ లాక్ చేసుకున్నాడట. మరి ఈ సినిమాతో అయినా పూరీ మంచి ఫలితాన్ని అందుకుంటాడేమో చూడాలి.






