ఓటీటీలపై నివేదా ఓపీనియన్ ఇదే!
హీరోయిన్లకు ఈ మధ్య సినిమాల కంటే ఓటీటీలో రిలీజవుతున్న వెబ్ సిరీస్‌లే క్రేజ్ ను తెచ్చి పెడుతున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో ప్రియమణి, సమంత ఎంత పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కియారా అద్వానీ, రాధికా ఆప్టే, తమన్నా, పాయల్ ఇలా ఎంతోమందికి ఓటీటీలు, వెబ్ సిరీస్ లు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఇప్పుడు తమిళ నటి నివేదా పేతురాజ్ కు కూడా అలాంటి పేరే దక్కుతుందని ఎంతో నమ్మకంగా ఉంది. అమ్మడు నటించిన పరువు అనే సిరీస్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పరువు, మర్యాదలు, పరువు నష్టం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ కోసం నివేదా ప్రమోషన్స్ కూడా బాగానే చేసింది. మొన్నామధ్య నివేదా పోలీసులతో వాదిస్తూ ఉన్న వీడియో ఈ ప్రమోషన్స్ లో భాగంగా చేసిందే.
నివేదా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఓటీటీల గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. నిజాయితీగా చెప్పాలంటే సినిమాల కంటే ఓటీటీ ప్రాజెక్ట్స్ లోనే స్త్రీ పాత్రలకు ఎక్కువ స్కోప్ ఉంటుందని, మనలోని కళను బయటకు తీసుకురావడానికి, మనకు సంతృప్తి ఇవ్వాలంటే ఓటీటీ అవకాశాలను అందుకోవాలని, పరువు సిరీస్ ద్వారా తనకు ఆ సంతృప్తి దక్కిందని చెప్పుకొచ్చింది. మరి పరువు నివేదాకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













