నిత్యా మీనన్ కి ఏమైంది?
అదృష్టం తలుపు తట్టినపుడే తలుపులు తెరవాలి అంటారు ఈ విషయం ఆపాదించవచ్చు. నిత్యా మీనన్ కు జరిగింది మహానటి సావిత్రి గా నటించమని అడిగితే అప్పట్లో తిరస్కరించింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ ఎంత మంది ఉన్నా కూడా కొంత మంది హీరోయిన్స్ కి మాత్రం సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఒక క్రేజ్ ఉంటుంది. అలాంటి వారిలో నిత్య మీనన్ ఒకరు. ఈ బ్యూటీ ఎలాంటి పాత్ర చేసినా అందులో ఎంతో కొంత కొత్తదనం ఉంటుంది. ఇకపోతే ఈ బ్యూటీ ఇటీవల ఒక బంగారం లాంటి బయోపిక్ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలా..మొదలైంది సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ బ్యూటీ ఆ తరువాత ఒక కథానాయికగా కాకుండా ఒక మంచి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది.
గ్లామర్ పాత్రలు చేయకుండా కేవలం నటనకు ప్రాధాన్యం వుండే సినిమాలు చేస్తూ కథానాయికగా అవకాశాలు అందుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో ఈ నటి కొన్ని కీలకాపాత్రల్లో నటించింది. నిత్య మీనన్ గ్లామర్ డోస్ పెంచకపోయినా కూడా చాలా వరకు ఆమెకు మంచి పాత్రలే వచ్చాయి. శాంపిల్ కి మహానటి సినిమాలో సావిత్రిగా చేయమని అప్పట్లో దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత స్వప్న దత్ సంప్రదించారు కానీ ఎందుకో ఆ సినిమాను రిజెక్ట్ చేసింది. అయితే ఇటీవల కథానాయకిగా రెండవసారి ఒక బయోపిక్ లో నటించే ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. వెయిట్ లీఫ్టింగ్ ఛాంపియన్ కరణం మల్లీశ్వరి బయోపిక్ లో నిత్యా మీనన్ ని అడిగినట్లు తెలుస్తోంది. ఒలింపిక్స్ లో కాంస్యం ఇతర ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ లో అనేక పథకాలూ సాధించిన తెలుగు తేజం కారణం మల్లీశ్వరి అంటే తెలియని వారుండరు.
ప్రముఖ రైటర్ కోన వెంకట్ ఆమె బయోపిక్ ని తెరకెక్కించాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు జూన్ 1వ తేదీ కరణం మల్లీశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం జరిగింది. అందులో మల్లీశ్వరి పాత్ర కోసం మొదట నిత్యామీనన్ ని అనుకున్నారు. అమెతో కొన్ని రోజుల పాటు దర్శకురాలు సంజన రెడ్డి కథపై చర్చలు కూడా జరిపిందట. అయితే ఎందుకో గాని నిత్య మీనన్ మళ్ళీ మనసు మార్చుకుందట. ఇదివరకే ఒకసారి మహానటి ఆఫర్ రాగా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న నిత్య మీనన్ కెరీర్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మరో మంచి ఛాన్స్ ని మిస్ చేసుకుందనే కామెంట్స్ వస్తున్నాయి. గత కొంత కాలంగా నిత్య మీనన్ కి సరైన అవకాశాలు అందడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక మలయాళం సినిమా మాత్రమే ఉంది. మరి ఈ బ్యూటీ మల్లీశ్వరి బయోపిక్ ని ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. కరణం మల్లీశ్వరి పాత్రలో నటింపచేయడానికి అనుష్క ను, అంజలి ని గాని తమన్నా ని తాప్సి పన్ను ని గాని నిర్మాతలు సంప్రదిస్తున్నట్టు తెలిసింది మరి ఆ పాత్ర ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.













