మరో ప్రేమకథ కు కీర్తి గ్రీన్‌సిగ్నల్
మహానటి తరువాత కెరీర్ మహత్తరంగా ఉంటుందనుకున్న కీర్తి ఆశలు ఫలించలేదు. ఆ పాత్ర తరువాత ఆమెను మర్యాదపూర్వక పాత్రల కోణంలోనే చూస్తుండటంతో స్టార్ హీరోల సినిమాల నుంచి చాన్స్‌లే లేకుండాపోయాయి. దీంతో నాయికా ప్రాధాన్యత కలిగి ఓ ప్రాజెక్టుతో సరిపెట్టుకుంది కీర్తి. ఈ తరుణంలో తనవద్దకు వచ్చిన మరో ప్రేమకథ కు కీర్తి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందంటున్నారు. నితిన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించనున్న వ్యూచర్ ప్రాజెక్టుకి కీర్తిని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హీరో నితిన్ భీష్మ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరగా ఈ ప్రాజెక్టు పూర్తయితే నితిన్ కీర్తిలతో వెంకీ అట్లూరి తన ప్రాజెక్టు సెట్స్‌పైకి తెస్తాడు.













