భీష్మ ప్రారంభం
నితిన్, రష్మిక మండన, వెంకీ కుడుముల కాంబినేషన్లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న నూతన చిత్రం భీష్మ ప్రారంభమయ్యింది. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. డిసెంబర్ నెలలో చిత్రం విడుదలయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతాయని నిర్మాత సూర్యదేవర నాగ వంశి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ గురించి నేను చాలా ఆనందంగా ఉన్నాను అన్నారు చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చినందుకు టీమ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి అబ్బాయి నితిన్ క్యారెక్టర్‌కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్‌కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. అలాగే చాలా ఫన్ ఎలిమెంట్స్‌తో సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.













