నితిన్ చిత్రానికి టైటిల్ ఖారారు!
శ్రీనివాస కల్యాణం ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో కొంత విరామం తీసుకున్న నితిన్ సినిమాల స్పీడు పెంచారు. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్రంలో నటిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. కాగా ఈ సినిమాతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య ఆనంద్‌ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రంలోనూ నటించనున్నారు. తాజాగా నితిన్ మరో చిత్రాన్ని కూడా అంగీకరించారు. ఛల్ మోహన్‌రంగ చిత్రాన్ని నితిన్‌తో రూపొందించిన కృష్ణచైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. మూడు భాగాలుగా తెరపైకి రాబోతున్న ఈ చిత్రానికి పవర్ వేట అనే టైటిల్‌ని చిత్ర బృందం ఖరారు చేసినట్లు సమాచారం. శ్రేష్ట మూవీస్ పతాకాంపై నితిన్ సోదరి నిఖితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. నా కెరీర్లో ఇదొక ఛాలెంజీంగ్ ఫిల్మ్. ఈ ఏడాది చివరలో చిత్రీకరణ మొదలవుతుంది. 2020 సమ్మర్‌కి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని హీరో నితిన్ వెల్లడించారు.













