కథ నచ్చాలి.. క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా ఉండాలి!
సౌత్‌లో ఉన్న హీరోయిన్లలో నిత్యా మీనన్‌కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆమె చేసిన సినిమాలన్నీ దాదాపుగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడే. ఆమె సినిమాలు ఎంచుకునే విధానంగా కూడా విభిన్నంగా ఉంటుంది. మొదల ఆమెకు కథ నచ్చాలి. ఆ తర్వాత సినిమాలో తన క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉండాలి. ఒకవిధంగా చెప్పాలంటే ఛాలెంజింగ్‌గా ఉండాలి. కథ, తన క్యారెక్టర్ నచ్చకపోతే ఎంత భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా నిత్య రిజెక్ట్ చేస్తుంది. ఈ విషయంలో అంత నిక్కచ్చిగా ఉంది కాబట్టే నటిగా ఆమెకు అంత పేరు వచ్చింది. ఇటీవల బాలీవుడ్లో అక్షయ్‌కుమార్ హీరోగా వచ్చిన `మిషన్ మంగళ్`లో నిత్య ఓ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంది. దీంతో బాలీవుడ్లో ఓ వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం దక్కించుకుంది.
ఈ వెబ్ సిరీస్‌లో అభిషేక్ బచ్చన్‌తో నటిస్తోంది. ‘బ్రీత్ ఇన్ టు ద షాడోస్’ వెబ్ సిరీస్ జులై లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. బ్రీత్ వెబ్ సిరీస్ పార్ట్ వన్‌లో మాధవన్ లీడ్ రోల్ లో నటించాడు. ఇప్పుడు ‘బ్రీత్ వెబ్ సిరీస్’కు సీక్వెల్ లో అభిషేక్ బచ్చన్ నటించడం విశేషం. ప్రస్తుతం నిత్యా మీనన్ దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా మూడు నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో నిత్యా మీనన్ నటిస్తున్న ‘ఐరన్ లేడీ’ కూడా ఉంది. ఎవరెన్ని తీసినా నేను చేస్తున్న సినిమాలో ఉన్న విషయాలను దర్శకురాలు ప్రియదర్శిని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆవిడ చెప్పిన కథ జయలలితగారి నిజ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలు నాకు ఆసక్తిని కలిగించాయి. అందుకే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నా అని తెలిపింది నిత్యా మీనన్.













