ఆ మ్యాజిక్ చేయాలని చూస్తున్న నితిన్
భీష్మ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబోలో మరో సినిమా తెరకెక్కుతుంది. భీష్మ సినిఆమతో నితిన్ కు మంచి హిట్ ఇచ్చిన వెంకీ ఈ సారి రాబిన్ హుడ్ అనే క్రేజీ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేశాడు.
ఛలో, భీష్మ తర్వాత ఆయన తీస్తున్న రాబిన్ హుడ్ తో ఎలాగైనా సక్సెస్ అందుకుని హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు వెంకీ. నితిన్ తో ఇప్పటికే వెంకీ కు భీష్మ తీసిన అనుభవం ఉంది కాబట్టి రాబిన్ హుడ్ కు ఈ అంశం కలిసి రానుంది. మరోసారి వీరిద్దరూ కలిసి భీష్మ మ్యాజిక్ ను రిపీట్ చేయాలని చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది.
మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను అనుకున్నారు కానీ తర్వాత రష్మిక కొన్ని సమస్యల వల్ల సినిమా నుంచి తప్పుకుంది. ప్రస్తుతం షూటింగ్ కూడా హీరోయిన్ లేకుండానే జరుగుతుంది. ఇప్పుడు రష్మిక ప్లేస్ లోకి శ్రీలీల వచ్చిందంటున్నారు. కానీ ఈ విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. మరి నితిన్ తను అనుకుంటున్నట్లు రాబిన్ హుడ్ తో భీష్మ మ్యాజిక్ చేస్తాడా లేదా అన్నది చూడాలి.













