ఇష్క్ కాంబోలో మూవీ?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తీసిన అన్ని సినిమాల్లో అతి పెద్ద హిట్ అంటే ఇష్క్. ఈ సినిమా ద్వారానే డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇష్క్ చూశాకే నాగార్జున, మనం సినిమాను విక్రమ్ చేతుల్లో పెట్టాడు. మనం ఫలితం అందరికీ తెలిసిందే. ఇష్క్ తర్వాత నితిన్, విక్రమ్ కలిసి మళ్లీ పని చేసింది లేదు.
ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రానుందని తెలుస్తోంది. నిరంజన్ రెడ్డి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవే. అయితే చైతూతో విక్రమ్ చేసిన థాంక్యూ సినిమా డిజాస్టర్ అవడంతో విక్రమ్ కెరీర్ డిఫెన్స్ లో పడిపోయింది.
కానీ దూత వెబ్ సిరీస్ కు మంచి పేరొచ్చింది. అయితే విక్రమ్ ట్రాక్ రికార్డ్ ను చూడకుండా నితిన్ తనతో సినిమా చేయడం మంచి విషయమే. తనకు ఇష్క్ లాంటి మంచి హిట్ ఇచ్చాడన్న నమ్మకంతో విక్రమ్ తో పని చేయడానికి నితిన్ ఉత్సాహంగా ఉన్నాడు. ప్రస్తుతం తమ్ముడు, రాబిన్ హుడ్ సినిమాలు చేస్తున్న నితిన్, ఆ రెండు సినిమాలు పూర్తి చేయడానికి ఈ ఏడాది పడుతుంది. అంతలోపు విక్రమ్ ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసి టైమ్ ను బట్టి సినిమాను పట్టాలెక్కిస్తారు. అయితే ఈ సినిమా ఇష్క్ లా కాకుండా పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో విక్రమ్ స్టైల్ లో ఉంటుందని సమాచారం.













