ఎట్టకేలకు రకుల్ గ్రీన్ సిగ్నల్
స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ఈ ఏడాది ఒక్క తెలుగు చిత్రానికి కూడా సైన్ చేయలేదు. ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రలో నటించినా అతి అతిథి పాత్రకే పరితమైంది. ప్రస్తుతం రకుల్ ఫోకస్ అంతా కోలీవుడ్, బాలీవుడ్‌పైనే ఉంది. రెండు తమిళ్, రెండు హిందీ సినిమాలతో ఆమె బిజీగా ఉంది. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది. యంగ్ హీరో నితిన్‌తో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఓ సినిమా తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రంలో రకుల్‌ను హీరోయిన్గా తీసుకున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై క్లారిటీ రానుంది.













