Nithin: ఇష్క్ డైరెక్టర్ తో టాలీవుడ్ గర్వించే సినిమా చేయబోతున్న నితిన్
వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వంలో తాను నటించిన రాబిన్హుడ్(Robinhood) సినిమాను ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin). మార్చి 27న రాబిన్హుడ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో నితిన్ యాక్టివ్ గా పాల్గొంటూ సినిమా గురించి, తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్తున్నాడు నితిన్.
రాబిన్హుడ్ ప్రమోషన్స్ లో భాగంగా నితిన్ ఓ ఇంటర్వ్యూలో తాను డైరెక్టర్ విక్రమ్. కె కుమార్(Vikram K Kumar) తో సినిమా చేస్తున్నట్టు వెల్లడించాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమా అన్నీ అనుకున్నట్టు జరిగితే తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించే సినిమా అవుతుందని నితిన్ తెలిపాడు. చూస్తుంటే నితిన్, విక్రమ్ ఏదో గట్టి ప్లానే వేసినట్టున్నారు.
ఇదిలా ఉంటే గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ఇష్క్(Ishq) మూవీ నితిన్ కెరీర్లోని భారీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత నుంచి వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాలేదు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నట్టు నితిన్ తెలిపాడు. ఈ సినిమాకు సంబంధించిన ఆల్రెడీ వీరిద్దరి మధ్య ఓ సారి స్టోరీ డిస్కషన్స్ కూడా అయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం రాబిన్హుడ్ ను రిలీజ్ కు రెడీ చేస్తున్న నితిన్, వేణు శ్రీ రామ్(Veni Sri Ram) తో తమ్ముడు (Thammudu) చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత బలగం(Balagam) ఫేమ్ వేణు(Venu) తో ఎల్లమ్మ(Yellamma)ను, విక్రమ్ తో స్పోర్ట్స్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.













