నాని, విశ్వక్ వద్దన్నది నితిన్ దగ్గరకి..
ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమా చేస్తున్న నితిన్, ఆ సినిమాను డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఈ సినిమాతో పాటూ నితిన్, వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో తమ్ముడు అనే సినిమా కూడా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది స్టార్టింగ్ లో రిలీజయ్యే ఛాన్సుంది.
ఈ సినిమాల తర్వాత నితిన్ ఎవరితో సినిమా చేయనున్నాడనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ నేపథ్యంలోనే పలు డైరెక్టర్ల పేరు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే బలగం ఫేమ్ వేణు యెల్దండి పేరు కూడా వినిపిస్తుంది. బలగం తర్వాత వేణు తన రెండో సినిమా కోసం హీరోని వెతికే పనిలో బిజీగా ఉండగా, ఇప్పుడు తన రెండో సినిమాను వేణు, నితిన్ తో చేయాలనుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ముందుగా వేణు తన రెండో సినిమాను నానితో చేద్దామనుకున్నాడు కానీ వరుస సినిమాలతో నాని బిజీగా ఉండటం వల్ల వేణు సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. తర్వాత ఇదే ప్రాజెక్ట్ ను విశ్వక్సేన్ తో చేయాలనుకున్నాడు వేణు. విశ్వక్ కూడా మెకానిక్ రాకీ తర్వాత మూడు సినిమాలను లైన్ లో పెట్టడం వల్ల బిజీగా ఉన్నాడు. దీంతో వేణు, నితిన్ ను సంప్రదించినట్లు, నితిన్ కూడా ఈ సినిమా చేయడానికి సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాను కూడా దిల్ రాజే నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే వేణు ఈసారి కంటెంట్ బేస్డ్ సినిమా కాకుండా యాక్షన్ జానర్ లో సినిమాను తీయనున్నాడని అంటున్నారు.













