ఫ్లాపు డైరక్టర్ తో నితిన్ సినిమా..?
రంగ్ దే సినిమాతో సక్సెస్ అందుకున్న యూత్ స్టార్ నితిన్, ప్రస్తుతం మాస్ట్రో అనే సినిమా చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డిలు నిర్మిస్తున్నారు. దీని తర్వాత పవర్ పేట అనే సినిమాను కృష్ణ చైతన్య డైరక్షన్ లో కమిట్ అయ్యాడు. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో నితిన్ మరో సినిమాకు సైన్ చేశాడని తెలుస్తుంది.
రైటర్ కమ్ డైరక్టర్ వక్కంతం వంశీ నితిన్ కు కథ వినిపించాడని తెలుస్తుంది. నితిన్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తుంది. అశోక్, అతిథి, ఊసరవెల్లి, రేసు గుర్రం, కిక్, టెంపర్, ఎవడు సినిమాలకు రచయితగా వర్క్ చేసిన వక్కంతం వంశీ, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో డైరక్టర్ గా మారి తొలి స్టెప్ లోనే ఫ్లాప్ అందుకున్నాడు. ఆ తర్వాత మరో సినిమాని డైరెక్ట్ చేసింది లేదు. వేరే డైరక్టర్ లకు స్టోరీలు అందిస్తున్నాడు. సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్న రెండు సినిమాలకు వంశీ రైటర్ గా వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే అఖిల్ కు స్టోరీ రెడీ చేసిన వంశీ, పవన్ కోసం మరో స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే నితిన్ కోసం మరో బ్లాక్ బస్టర్ స్టోరీని రెడీ చేశారట.
ఇప్పటికే నితిన్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, ఈ సినిమా కూడా నితిన్ హోమ్ బ్యానర్ లోనే ఉండనుందని వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే నితిన్ సురేందర్ రెడ్డి తో కూడా ఒక సినిమా చేస్తాడనే టాక్ ఉంది. మరి వంశీ రెడీ చేసిన స్టోరీ నితిన్ ని డైరెక్ట్ చేయడానికా లేక సూరి డైరక్షన్ లో రానున్న సినిమా కోసమా అనేది తెలియాల్సి ఉంది.













