పవర్ స్టార్ బ్యానర్ లో క్యూట్ స్టార్ నితిన్ చిత్రం?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మొత్తం మూడు సినిమాలు చేస్తున్నారు. వాటిలో వేణు శ్రీరామ్ తీస్తున్న వకీల్ సాబ్, క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న హరి హర వీరమల్లు శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అలానే రానా కాంబినేషన్ లో అయ్యప్పనుం కోషియం రీమేక్ మూవీ ముహూర్తం జరుపుకుంది. అయితే వీటిలో వకీల్ సాబ్ వచ్చే నెల 9న రిలీజ్ కానుండగా హరి హర వీరమల్లు 2022 జనవరి లో అలానే, అయ్యేప్పనుం కోషియం రీమేక్ ఈ ఏడాది వినాయక చవితి కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయిన పవర్ స్టార్ మరోవైపు వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగుతుండడంతో ఆయన అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందునా క్రిష్ తో చేస్తున్న హరి హర వీరమల్లు మూవీ పవర్ స్టార్ కి తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో అది తప్పకుండా ఎంతో భారీ విజయాన్ని అందుకుని ఆయనకు నటుడిగా మరింత గొప్ప క్రేజ్ తెచ్చిపెడుతుందని పలువురు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
అసలు విషయాకికొస్తే…. స్వతహాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అయిన నితిన్ మధ్యలో అక్కడక్కడా తన సినిమాల్లో పవర్ స్టార్ రిఫరెన్సు ఉన్న సీన్స్ జోడిస్తూ ఉంటారు. అలానే ఇటీవల వచ్చిన గుండె జారీ గల్లంతయ్యిందే మూవీలో ఏకంగా పవర్ స్టార్ నటించిన తొలిప్రేమ మూవీలోని ఏమయిందో ఏమో ఈ వేళా అనే సాంగ్ ని రీమిక్స్ చేసాడు నితిన్. ప్రస్తుతం వెంకీ అట్లూరి తో రంగ్ దే మూవీ చేస్తున్న నితిన్, దీని అనంతరం తన అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత బ్యానరైన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ పతాకం పై ఒక సినిమా చేయనున్నారని, ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక యువ దర్శకుడు అద్భుతమైన స్టోరీ సిద్ధం చేస్తున్నట్లు టాక్. అలానే ఈ సినిమా యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానుందట.













